Share News

ఒజెంపిక్‌, వెగోవీ ధరలు తగ్గించాం

ABN , Publish Date - Apr 01 , 2026 | 02:37 AM

భారత ఫార్మా కంపెనీల జెనరిక్‌ సెమాగ్లుటైడ్‌ దెబ్బ.. బహుళ జాతి ఫార్మా కంపెనీ నోవో నార్డి్‌స్కకు బాగానే తగిలింది. దీంతో...

ఒజెంపిక్‌, వెగోవీ ధరలు తగ్గించాం

నోవో నార్డిస్క్‌

న్యూఢిల్లీ: భారత ఫార్మా కంపెనీల జెనరిక్‌ సెమాగ్లుటైడ్‌ దెబ్బ.. బహుళ జాతి ఫార్మా కంపెనీ నోవో నార్డి్‌స్కకు బాగానే తగిలింది. దీంతో తన బ్లాక్‌బస్టర్‌ వెయిట్‌లాస్‌, టైప్‌ 2 డయాబెటిక్‌ ఔషధాలు ఒజెంపిక్‌, వెగోవీ ధరలను 36 నుంచి 48 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 0.25 ఎంజీ మోతాదులో ఉండే ఈ రెండుపేటెంట్‌ ఔషధాల రోజువారీ వినియోగ ప్రారంభ ధర భారత మార్కెట్లో రూ..202కు, వారానికి రూ.1,415కు తగ్గనుంది. భారత్‌లో ఈ రెండు పేటెంట్‌ ఔషదాలను మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నోవో నార్డిస్క్‌ ఇండియా ఎండీ విక్రాంత్‌ షోరోత్రియా తెలిపారు. అయితే భారత ఫార్మా కంపెనీల జెనరిక్‌ సెమాగ్లుటైడ్‌ ఔషధాల దెబ్బకు తన మార్కెట్‌ ఎక్కడ గల్లంతువుతుందోననే భయంతోనే కంపెనీ ఇలా ధరలు తగ్గించిందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - Apr 01 , 2026 | 02:37 AM