Share News

నిస్సాన్‌ ‘టెక్టాన్‌’ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.10.49 లక్షలు

ABN , Publish Date - Jul 10 , 2026 | 02:28 AM

నిస్సాన్‌ మోటార్‌ ఇండియా.. మార్కెట్లోకి సరికొత్త మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ టెక్టాన్‌ను తీసుకువచ్చింది. మొత్తం 11 వేరియంట్లలో ఈ ఎస్‌యూవీ...

నిస్సాన్‌ ‘టెక్టాన్‌’ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.10.49 లక్షలు

న్యూఢిల్లీ: నిస్సాన్‌ మోటార్‌ ఇండియా.. మార్కెట్లోకి సరికొత్త మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ టెక్టాన్‌ను తీసుకువచ్చింది. మొత్తం 11 వేరియంట్లలో ఈ ఎస్‌యూవీ అందుబాటులో ఉండనుంది. ఈ ఎస్‌యూవీ ధరలు రూ.10.59 లక్షల నుంచి రూ.18.59 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉన్నాయి. ఈ నెల 20 నుంచి ఈ కార్ల డెలివరీలను ప్రారంభించనున్నట్లు నిస్సాన్‌ వెల్లడించింది. కంపెనీ మూడేళ్ల తర్వాత మళ్లీ టెక్టాన్‌తో ఎస్‌యూవీ విభాగంలోకి అడుగుపెట్టింది. గతంలో కంపెనీ ఎస్‌యూవీ విభాగంలో కిక్స్‌ మోడల్‌ను విక్రయించింది. టెక్టాన్‌ విడుదలతో మార్కెట్లో పట్టును పెంచుకోవటమే కాకుండా ఏటా 2 లక్షల కార్లను విక్రయించాలని నిస్సాన్‌ మోటార్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ వార్తలనూ చదవండి:

రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 10 , 2026 | 02:28 AM