22,000 వద్ద బలమైన పరీక్ష
ABN , Publish Date - Oct 12 , 2026 | 05:22 AM
నిఫ్టీ గత వారం ఆరంభంలో 350 పాయింట్ల అప్‌ట్రెండ్ కనబరిచి ఆ తర్వాత 540 పాయింట్లు పతనమైన అనంతరం మళ్లీ 300 పాయింట్ల అప్‌ట్రెండ్‌ను కనబరిచింది. గత వారం మార్కెట్ పూర్తిగా ఆటుపోట్ల ట్రెండ్‌లో సాగింది.
నిఫ్టీ గత వారం ఆరంభంలో 350 పాయింట్ల అప్‌ట్రెండ్ కనబరిచి ఆ తర్వాత 540 పాయింట్లు పతనమైన అనంతరం మళ్లీ 300 పాయింట్ల అప్‌ట్రెండ్‌ను కనబరిచింది. గత వారం మార్కెట్ పూర్తిగా ఆటుపోట్ల ట్రెండ్‌లో సాగింది. వీక్లీ ప్రాతిపదికన చివరకు 100 పాయింట్ల లాభంతో 22,520 వద్ద క్లోజైంది. వరుసగా తొమ్మిది వారాల డౌన్‌ట్రెండ్ అనంతరం తొలిసారిగా మైనర్ పాజిటివ్ ట్రెండ్‌ను సూచించింది. మార్కెట్ ప్రస్తుతం స్వల్ప బౌన్స్‌బ్యాక్‌ను కనబరిచినప్పటికీ స్పష్టమైన స్వల్పకాలిక దిశ, నిలకడ కోసం కనీసం మరొక వారం పాటు కన్సాలిడేట్ కావటంతో పాటు పటిష్ఠతను సూచించాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో ఈ వారం మార్కెట్ అప్రమత్త ట్రెండ్‌తో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్వల్పకాలిక సానుకూలత కోసం 22,000 స్థాయిల వద్ద కొద్ది రోజుల పాటు నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. కాగా మిడ్‌క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా 55 పాయింట్ల లాభంతో 58,780 వద్ద క్లోజైంది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ కూడా 95 పాయింట్లు లాభపడి 19,150 వద్ద ముగిసింది.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ గత వారం పూర్తిగా అనిశ్చిత ట్రెండ్‌ను కనబరిచి తదుపరి కన్సాలిడేషన్‌ను సూచించింది. నిఫ్టీ ఈ వారం ఏదేనీ సానుకూల ట్రెండ్‌ను సూచిస్తే 22,700 ఎగువన నిరోధ స్థాయిలుంటాయి. ఇక్కడ నిలదొక్కుకుంటే తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 23,000. ఇది రెండు వారాల క్రితం ఏర్పడిన గరిష్ఠ స్థాయి.
బేరిష్ స్థాయిలు: నిఫ్టీ మరింత బలహీనతను సూచిస్తే 22,200 దిగువన మద్దతు స్థాయిలు ఉంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే అప్రమత్తతను సూచిస్తుంది. తదుపరి ప్రధాన మద్దతు స్థాయి 22,000 దిగువన ఉంటుంది. ఇది మధ్యకాలిక మద్దతు స్థాయి.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం ఈ సూచీ నిలకడగా సాగుతూ 800 పాయింట్ల లాభంతో 55,250 వద్ద క్లోజైంది. ప్రస్తుతం ఈ సూచీ 55,500 వద్ద బలమైన నిరోధాన్ని ఎదుర్కొంటోంది. పాజిటివ్ ట్రెండ్ కోసం ఈ స్థాయిలకు ఎగువన నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 56,200. ఒకవేళ ఏదేనీ బలహీనతను సూచిస్తే మద్దతు స్థాయిలైన 55,000 వద్ద నిలదొక్కుకోవాలి. ఇక్కడ అప్రమత్తతను సూచిస్తుంది. తదుపరి మద్దతు స్థాయిలు 54,400, 54,000.
పాటర్న్: ప్రస్తుతం మార్కెట్ 22,000 వద్ద ట్రిపుల్ బాటమ్ ప్యాట్రన్ స్వల్ప ఎగువన ఉంది. మంత్లీ చార్టుల ప్రకారం ఈ మూడు బాటమ్స్ 2024 మే, 2025 మార్చి, 2026 ఏప్రిల్‌లో ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఇక్కడ నుంచి రికవరీ అయ్యాయి. ప్రస్తుతం మార్కెట్ స్వల్పకాలిక చలన సగటుకు దిగువన ఉంది.
టైమ్: ఈ సూచీ ప్రకారం బుధవారం మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 22,620, 22,700
మద్దతు : 22,400, 22,310