తగ్గిన ఎన్‌సీసీ లాభం
ABN , Publish Date - Feb 06 , 2026 | 04:36 AM
ఎన్‌సీసీ లిమిటెడ్.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.4,900 కోట్ల టర్నోవర్‌పై...
ఎన్‌సీసీ లిమిటెడ్.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.4,900 కోట్ల టర్నోవర్‌పై రూ.122.46 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో టర్నోవర్ రూ.5,382.86 కోట్లు గా ఉండగా లాభం రూ.193.18 కోట్లుగా ఉంది. కాగా స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.185.27 కోట్ల నుంచి రూ.82.01 కోట్లకు తగ్గింది. మొత్తం టర్నోవర్ రూ.4,719.87 కోట్ల నుంచి రూ.4,082.27 కోట్లకు తగ్గింది.