ఎన్‌బీఎఫ్‌సీల బంగారం రుణాలు.. రూ.3.29 లక్షల కోట్లు
ABN , Publish Date - Jul 08 , 2026 | 05:57 AM
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ) బంగారం రుణాలు పెద్ద బిజినెస్‌గా మారాయి. ఈ ఏడాది మే నాటికి...
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ) బంగారం రుణాలు పెద్ద బిజినెస్‌గా మారాయి. ఈ ఏడాది మే నాటికి పసిడి నగల హామీపై ఎన్‌బీఎఫ్‌సీలు ఇచ్చే రుణాలు రూ.3.29 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 70 శాతం ఎక్కువ. గత ఏడాది కాలంలో ఎన్‌బీఎఫ్‌సీలు ఇచ్చే ఏ రుణాల్లోనూ ఇంత వృద్ధి కనిపించలేదు. ఆర్‌బీఐ దీనికి సంబంధించి తాజా గణాంకాలు విడుదల చేసింది. గత ఏడాది మేతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలోఎన్‌బీఎఫ్‌సీల గృహ, వాహన రుణాల్లోనూ మంచి వృద్ధి రేటు కనిపించింది.
ఇవి కూడా చదవండి..
శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు