సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను ఏఐ భర్తీ చేయలేదు
ABN , Publish Date - Feb 24 , 2026 | 06:15 AM
కృత్రిమ మేధ (ఏఐ)తో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఐటీ నిపుణుల ఉద్యోగాలు పోతాయన్న భయాలను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ తోసిపుచ్చారు. నిజానికి ఏఐ వీరి నైపుణ్యాలు...
మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ)తో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఐటీ నిపుణుల ఉద్యోగాలు పోతాయన్న భయాలను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ తోసిపుచ్చారు. నిజానికి ఏఐ వీరి నైపుణ్యాలు, సృజనాత్మకతను మరింత పెంచుతుందన్నారు. ప్రజలను మరింత తెలివైన వారుగా మార్చే టెక్నాలజీలను అభివృద్ధి చేయడమే తమ కంపెనీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏఐ వల్ల పునరావృతమయ్యే కోడింగ్ పనులు మాత్రమే పోతాయన్నారు. దాంతో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు ప్రొడక్ట్ డిజైన్, ఆర్కిటెక్చర్, టెస్టింగ్, సెక్యూరిటీలపై మరింతగా దృష్టి పెట్టవచ్చన్నారు. దీంతో కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడి జీతాలూ పెరిగే అవకాశం ఉందన్నారు. ఏఐ లక్ష్యాలు ఏమిటో కంపెనీలు స్పష్టంగా నిర్వచించుకోవాలని స్మిత్ సూచించారు.