Share News

మెర్సిడెస్‌ ఏఎంజీ ఈ 53 హైబ్రిడ్‌ కారు

ABN , Publish Date - Jul 24 , 2026 | 02:12 AM

లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌.. మార్కెట్లోకి ఏఎంజీ ఈ 53 హైబ్రిడ్‌ 4మాటిక్‌ ప్లస్‌ కారును విడుదల చేసింది..

మెర్సిడెస్‌ ఏఎంజీ ఈ 53 హైబ్రిడ్‌ కారు

ప్రారంభ ధర రూ.1.45 కోట్లు

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌.. మార్కెట్లోకి ఏఎంజీ ఈ 53 హైబ్రిడ్‌ 4మాటిక్‌ ప్లస్‌ కారును విడుదల చేసింది. ఏఎంజీ ఈ-క్లాస్‌ విభాగంలో తొలి ఈవీ కారు ఇది. రెండు ఎడిషన్లలో అందుబాటులో ఉండనున్న ఈ కారు ధరలు రూ.1.45 కోట్లు, రూ.1.48 కోట్లు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉన్నాయి. ఎలక్ర్టిక్‌ మోటార్‌, 3.0 లీటర్‌ ఇన్‌ లైన్‌ 6 సిలిండర్‌ టర్బోచార్జ్‌డ్‌ ఇంజన్‌తో ఈ ప్లగ్‌-ఇన్‌ కారును తీసుకువచ్చింది. కాగా ఎలక్ట్రిక్‌ మోటార్‌ 430 కేడబ్ల్యూ, 450 కేడబ్ల్యూ సామర్థ్యంతో పనిచేస్తుంది.

Updated Date - Jul 24 , 2026 | 02:12 AM