మాస్‌చిప్ చేతికి వాయవ్య ల్యాబ్స్
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:14 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెమీకండక్టర్ సంస్థ మాస్‌చిప్ టెక్నాలజీ.. కర్ణాటకలోని బెళగావికి చెందిన వాయవ్య ల్యాబ్స్‌లో...
రూ.245 కోట్లతో 73% వాటా కొనుగోలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెమీకండక్టర్ సంస్థ మాస్‌చిప్ టెక్నాలజీ.. కర్ణాటకలోని బెళగావికి చెందిన వాయవ్య ల్యాబ్స్‌లో 73 శాతం వాటాను రూ.245.49 కోట్లకు చేజిక్కించుకుంది. నగదు, ఈక్విటీ రూపంలో ఈ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వాయవ్య ల్యాబ్స్ కొనుగోలుతో కంపెనీ సాఫ్ట్‌వేర్ ఆధారిత ఇంజనీరింగ్ సామర్థ్యాలను మరింత పటిష్ఠం చేయటంతో పాటు అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించే అవకాశం లభిస్తుందని మాస్‌చిప్ పేర్కొంది. ఎంబెడెడ్ సిస్టమ్స్, వర్చువలైజేషన్, వెరిఫికేషన్ టెక్నాలజీల్లో కీలకంగా ఉన్న వాయవ్య ల్యాబ్స్ ప్రస్తుతం బెంగళూరు, బెళగావిలో రెండు డెవల్‌పమెంట్ సెంటర్లను నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి
వేగంగా తినే అలవాటు బరువు పెరగడానికి కారణమవుతుందా?
'దోశ, ఇడ్లీ' పాటపై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు..