పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారు!
ABN , Publish Date - Jun 03 , 2026 | 01:08 AM
దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతి సుజుకీ ఇండియా మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా...
ఈ నెల 5న విడుదల చేయనున్న మారుతి సుజుకీ
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతి సుజుకీ ఇండియా మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా మారుతి పూర్తిగా ఇథనాల్‌తో (ఈ-100) నడిచే కారును విడుదల చేయనుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ మధ్యనే వెల్లడించారు. దేశంలో ఇదే తొలి ఈ-100 ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు కానుంది. దేశంలో ఇప్పటికే 20 శాతం ఇథనాల్ మిళిత పెట్రోల్‌ను మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఇథనాల్ వాటాను 30 శాతానికి పెంచే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో మారుతి పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారును ఆవిష్కరించనుండటం గమనార్హం. పెట్రోల్‌తో పోలిస్తే పూర్తి ఇథనాల్‌తో ఇంధన ఖర్చు 25-35 శాతం మేర తగ్గవచ్చని వాహన పరికరాల తయారీ సంస్థ యూసీఏఎల్ లిమిటెడ్ జాయింట్ ఎండీ ఆదిత్య జయాకర్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..