Share News

ఐపీఓకి మర్రి రిటైల్‌

ABN , Publish Date - Jul 11 , 2026 | 04:52 AM

చెన్నై షాపింగ్‌ మాల్‌, జేసీ బ్రదర్స్‌, జీన్స్‌ కార్నర్‌ పేర్లతో రిటైల్‌ వస్త్ర విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న హైదరాబాద్‌ సంస్థ మర్రి రిటైల్‌ లిమిటెడ్‌.. తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు...

ఐపీఓకి మర్రి రిటైల్‌

  • రూ.522 కోట్ల సమీకరణ లక్ష్యం

  • జేసీ బ్రదర్స్‌, చెన్నె షాపింగ్‌ మాల్‌ పేర్లతో స్టోర్ల నిర్వహణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): చెన్నై షాపింగ్‌ మాల్‌, జేసీ బ్రదర్స్‌, జీన్స్‌ కార్నర్‌ పేర్లతో రిటైల్‌ వస్త్ర విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న హైదరాబాద్‌ సంస్థ మర్రి రిటైల్‌ లిమిటెడ్‌.. తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా రూ.522 కోట్ల విలువైన తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రమోటర్‌ మర్రి వెంకట్‌ రెడ్డి వాటాకు చెందిన 2.7 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా విక్రయించనున్నట్లు సెబీకి సమర్పించిన ప్రాథమిక ముసాయిదా పత్రాల్లో (డీఆర్‌హెచ్‌పీ) కంపెనీ వెల్లడించింది. తాజా ఈక్విటీ జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ.115.6 కోట్లను రుణాల తిరిగి చెల్లింపులకు, రూ.250.5 కోట్లను 10 కొత్త స్టోర్ల ప్రారంభం కోసం ఉపయోగించుకోనున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే, ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.104.4 కోట్ల వరకు సమీకరించే ఆలోచన కూడా ఉందని డీఆర్‌హెచ్‌పీలో పేర్కొంది.

ఒకవేళ ఈ మార్గాన నిధులను సేకరిస్తే ఐపీఓలో తాజా ఈక్విటీ జారీ సైజును అందుకనుగుణంగా తగ్గించుకోనున్నట్లు మర్రి రిటైల్‌ స్పష్టం చేసింది. 1999లో జీన్స్‌ కార్నర్‌ బ్రాండ్‌నేమ్‌తో రెడీమేడ్‌ వస్త్రాల షోరూమ్‌లతో మర్రి రిటైల్‌ తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2013లో హైదరాబాద్‌లో చెన్నై షాపింగ్‌ మాల్‌ బ్రాండ్‌నేమ్‌తో తొలి స్టోర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం కంపెనీ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలోని 26 జిల్లాల్లో మొత్తం 34 రిటైల్‌ స్టోర్లను నిర్వహిస్తోంది.

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 11 , 2026 | 04:52 AM