Share News

మార్క్‌ మొబియస్‌ కన్నుమూత

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:11 AM

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ (89) మరిక లేరు. భారత్‌తో సహా అనేక వర్థమాన దేశాల స్టాక్‌ మార్కెట్ల వృద్ధిపై అపార నమ్మకం ఉన్న మొబియస్‌ కన్నుమూశారు...

మార్క్‌ మొబియస్‌ కన్నుమూత

న్యూయార్‌: ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ (89) మరిక లేరు. భారత్‌తో సహా అనేక వర్థమాన దేశాల స్టాక్‌ మార్కెట్ల వృద్ధిపై అపార నమ్మకం ఉన్న మొబియస్‌ కన్నుమూశారు. భారత స్టాక్‌ మార్కెట్లో ర్యాలీ 50 ఏళ్ల పాటు కొనసాగుతుందని 2021లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రాల్లో పీహెచ్‌డీ చేసిన మొబియస్‌కు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లపై 50 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆసియాలోని భారత్‌, చైనా స్టాక్‌ మార్కెట్లతో పాటు రష్యా, వెనెజువెలా మార్కెట్లపైనా ఆయనకు గట్టి పట్టు ఉంది. ఇటీవలి వరకు ఆయన టెంపుల్టన్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ గ్రూప్‌లో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పనిచేశారు.

ఇవి కూడా చదవండి

వేగంగా తినే అలవాటు బరువు పెరగడానికి కారణమవుతుందా?

'దోశ, ఇడ్లీ' పాటపై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు..

Updated Date - Apr 17 , 2026 | 03:11 AM