Share News

హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్‌ ఫైనాన్షియల్‌ జీసీసీ

ABN , Publish Date - Feb 05 , 2026 | 05:29 AM

అమెరికాకు చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఎల్‌పీఎల్‌ ఫైనాన్షియల్‌.. హైదరాబాద్‌లో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను ప్రారంభించింది..

హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్‌ ఫైనాన్షియల్‌ జీసీసీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికాకు చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఎల్‌పీఎల్‌ ఫైనాన్షియల్‌.. హైదరాబాద్‌లో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను ప్రారంభించింది. ఈ సెంటర్‌ ద్వారా అడ్వాన్స్‌డ్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ టూల్స్‌, అప్లికేషన్స్‌తో అంతర్జాతీయ క్లయింట్లకు సేవలందించనున్నట్లు వెల్లడించింది. 1,200 ఆర్థిక సంస్థలు, 32,000 మందికి పైగా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌తో పాటు దాదాపు 80 లక్షల మంది ఖాతాదారులకు కంపెనీ సేవలందిస్తోంది. హైదరాబాద్‌ జీసీసీ కోసం కంపెనీ..నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, ఏఐ ఇంజనీరింగ్‌, డేటా ప్లాట్‌ఫామ్స్‌, మిడిల్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌లో నిపుణులైన వారిని నియమించుకోవాలని చూస్తోంది. కాగా కంపెనీ ఈవీపీ, కంట్రీ హెడ్‌గా రమేశ్‌ కాజాను నియమించుకుంది.

Updated Date - Feb 05 , 2026 | 05:29 AM