Share News

ఎల్‌ఐసీ లాభం రూ.13,492 కోట్లు

ABN , Publish Date - Aug 07 , 2026 | 04:57 AM

భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) 23 శాతం వృద్ధితో రూ.13,492 కోట్ల నికర...

ఎల్‌ఐసీ లాభం రూ.13,492 కోట్లు

న్యూఢిల్లీ: భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) 23 శాతం వృద్ధితో రూ.13,492 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.10,987 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సమీక్షా త్రైమాసికంలో సంస్థ మొత్తం ఆదాయం రూ.2,22,864 కోట్ల నుంచి రూ.2,37,848 కోట్లకు పెరిగింది. కొత్త వ్యాపారంలో పెరుగుదల సంస్థ లాభాల్లో వృద్ధికి దోహదపడింది. మొత్తం ప్రీమియం ఆదాయం జూన్‌ త్రైమాసికంలో రూ.1,27,250 కోట్లుగా ఉందని, క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,19,200 కోట్లతో పోల్చితే 6.75 శాతం వృద్ధి నమోదైందని ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ ఆర్‌ దొరైస్వామి తెలిపారు. కాగా జూన్‌ త్రైమాసికంలో ఎల్‌ఐసీ తొలి సంవత్సర ప్రీమియం ఆదాయం రూ.9,217 కోట్లకు పెరిగింది. రెన్యూవల్‌ ప్రీమియం ఆదాయం రూ.61,833 కోట్లకు చేరుకుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..

చెత్తకుప్పలో కాలిన మృతదేహం.. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు

Updated Date - Aug 07 , 2026 | 04:57 AM