లెక్సస్ ఇండియా.. సరికొత్త ఈఎస్ 350హెచ్
ABN , Publish Date - Sep 02 , 2026 | 05:05 AM
లెక్సస్ ఇండియా మార్కెట్లోకి సెల్ఫ్ చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వేరియంట్.. ఈఎస్ 350హెచ్‌ను విడుదల చేసింది. ఇది ఎనిమిదో తరం ఎగ్జిక్యూటివ్...
లెక్సస్ ఇండియా మార్కెట్లోకి సెల్ఫ్ చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వేరియంట్.. ఈఎస్ 350హెచ్‌ను విడుదల చేసింది. ఇది ఎనిమిదో తరం ఎగ్జిక్యూటివ్ సెడాన్ అని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ హికారు ఇకెయుచి తెలిపారు. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (హెచ్‌ఈవీ), బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (బీఈవీ) పవర్‌ట్రెయిన్స్‌తో ఈ కారును తీసుకువచ్చింది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండను న్న ఈ కారు ధరలు రూ.66.10 లక్షలు, రూ.71.80 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉన్నాయి. 2.5 ఇన్‌లైన్ 4-సిలిండర్ ఇంజన్,కొత్తగా అభివృద్ధి చేసిన హైబ్రిడ్ సిస్టమ్, లిథియం అయాన్ బ్యాటరీతో ఈ కారును తీసుకువచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని
వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..