కిమ్స్ అనంతపురం హాస్పిటల్స్ విస్తరణ
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:38 AM
ఆంధ్రప్రదేశ్ అనంతపురంలోని కిమ్స్ సవేరా హాస్పిటల్ పడకల సామర్థ్యాన్ని 250 నుంచి 500కి పెంచినట్లు కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆంధ్రప్రదేశ్ అనంతపురంలోని కిమ్స్ సవేరా హాస్పిటల్ పడకల సామర్థ్యాన్ని 250 నుంచి 500కి పెంచినట్లు కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్) ప్రకటించింది. ఈ విస్తరణతో రాయలసీమ ప్రాంతంలో స్పెషలైజ్డ్ మెడికల్ కేర్ సదుపాయాలతో పాటు గ్రూప్ హెల్త్‌కేర్ సేవలు మరింత బలోపేతమయ్యాయని తెలిపింది. అనంతపురం హాస్పిటల్ విస్తరణతో మొత్తం పడకల సామర్థ్యం 9,117కి చేరిందని కిమ్స్ వెల్లడించింది. నవంబరు 1న ఈ విస్తరణ యూనిట్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు కిమ్స్ హాస్పిటల్స్ పేర్కొంది.