సెప్టెంబరు 4న మార్కెట్లోకి కియా సొరెంటో
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:06 AM
అత్యాధునిక ఫీచర్లతో తయారైన కియా సొరెంటో కారు త్వరలో మార్కెట్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా...
పెనుకొండ రూరల్ (ఆంధ్రజ్యోతి): అత్యాధునిక ఫీచర్లతో తయారైన కియా సొరెంటో కారు త్వరలో మార్కెట్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో ఉన్న కియా పరిశ్రమలో ఈ కారును తయారు చేశారు. సరికొత్త ఏఐ ఫీచర్లతో తయారైన తొలి సొరెంటో కారు ఉత్పత్తి లైన్ నుంచి బయటకు వచ్చిందని కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గ్వాంగులీ తెలిపారు. సొరెంటోను సెప్టెంబరు 4న మార్కెట్లోకి విడుదల చేస్తామని, దేశంలోని కియా ఇండియా డీలర్‌షి్‌పలు, వెబ్‌సైట్ ద్వారా ప్రీ బుకింగ్స్‌కు అవకాశం కల్పించామని తెలిపారు.