దుబాయ్‌లో జోయాలుక్కాస్ ‘జువెల్ ఆఫ్ జాయ్’ షోరూమ్
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:45 AM
జువెలరీ రిటైలర్ జోయాలుక్కాస్.. దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో ‘జువెల్ ఆఫ్ జాయ్’ పేరుతో అతిపెద్ద జువెలరీ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది
హైదరాబాద్: జువెలరీ రిటైలర్ జోయాలుక్కాస్.. దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో ‘జువెల్ ఆఫ్ జాయ్’ పేరుతో అతిపెద్ద జువెలరీ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ నెల 18న ఈ షోరూమ్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) విదేశీ వాణిజ్య శాఖ మంత్రి థానీ బిన్ అహ్మద్ అల్ జైదీ అధికారికంగా ప్రారంభించనున్నట్లు జోయాలుక్కాస్ వెల్లడించింది. 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ పశ్చిమాసియాలో అతిపెద్దదని తెలిపింది. నాలుగు దశాబ్దాలుగా యూఏఈలో కార్యకలాపాలు సాగిస్తున్న జోయాలుక్కాస్ ఈ కొత్త షోరూమ్‌తో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుందని జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జాయ్ అలుక్కాస్ తెలిపారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా తమ స్థానా న్ని మరింత పటిష్ఠం చేస్తుందన్నారు. ప్రీమియం వీఐపీ లాంజ్‌తో పాటు వినియోగదారులకు అద్భుతమైన షా పింగ్ అనుభవాన్ని కల్పించేందుకు ఈ షోరూమ్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు జోయాలుక్కాస్ వెల్లడించింది.