జోయాలుక్కాస్ ఆభరణ ఉత్సవం
ABN , Publish Date - May 21 , 2026 | 01:58 AM
ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ ఆభరణ ఉత్సవాన్ని ప్రారంభించింది. ఈ నెల 15న ప్రారంభమైన...
హైదరాబాద్: ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ ఆభరణ ఉత్సవాన్ని ప్రారంభించింది. ఈ నెల 15న ప్రారంభమైన ఈ ఉత్సవాన్ని జూన్ 14 వరకు జోయాలుక్కాస్ అన్ని షోరూమ్‌లలో నిర్వహించనుంది. ఇందులో భాగంగా పాత బంగారం మార్పిడిపై సున్నా శాతం తగ్గింపు.. బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వెండి ఆభరణాల తయారీ చార్జీలపై 40 శాతం తగ్గింపును అందిస్తోంది. వినియోగదారులు పాత బంగారాన్ని మార్పిడి చేసి కొత్త ఆభరణాలకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.