పేటెంట్లలో జియో ప్లాట్‌ఫామ్స్ హవా..
ABN , Publish Date - Jun 15 , 2026 | 05:29 AM
రిలయన్స్ ఇండస్ర్టీ్‌సకు చెందిన టెక్నాలజీ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ పేటెంట్లలో సత్తా చాటుతోంది...
గ్లోబల్ టాప్ 20లో స్థానం
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ర్టీ్‌సకు చెందిన టెక్నాలజీ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ పేటెంట్లలో సత్తా చాటుతోంది. ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీవో) విడుదల చేసిన తాజా పేటెంట్ కో ఆపరేషన్ ట్రీటీ (పీసీటీ) ర్యాంకింగ్స్‌లో టాప్ 20లోకి ప్రవేశించింది. 2025 సంవత్సరానికి సంబంధించిన జాబితాలో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) ఏకంగా 320 స్థానాలు ఎగబాకి 20వ స్థానాన్ని దక్కించుకోవటం గమనార్హం. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆవిష్కర్తలలో ఒకటిగా నిలిచింది. దీంతో హువే, సామ్‌సంగ్, క్వాల్‌కామ్, ఎల్‌జీ, పానసోనిక్, నోకియా, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాల సరసన చేరింది. ప్రతిష్ఠాత్మకమైన గ్లోబల్ టాప్-20 జాబితాలోకి ప్రవేశించిన ఏకైక భారతీయ టెక్నాలజీ ఆవిష్కర్తగా జియో నిలవడం విశేషం. 2026 మార్చి 31 నాటికి జియో ప్లాట్‌ఫామ్స్ మొత్తం 6,817 పేటెంట్లను ఫైల్ చేసింది.