ఐటీ షేర్ల ర్యాలీ
ABN , Publish Date - Oct 10 , 2026 | 05:18 AM
స్టాక్ మార్కెట్లో రెండు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 1,076 పాయిం ట్ల మేర ఎగబాకినప్పటికీ, చివరికి 879.09 పాయింట్ల (1.23 శాతం) లాభంతో 72,472.33 వద్దకు చేరింది.
సెన్సెక్స్ 879 పాయింట్లు అప్ మళ్లీ 22,500 పైకి చేరిన నిఫ్టీ
రూ.4.34 లక్షల కోట్ల సంపద వృద్ధి
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 1,076 పాయిం ట్ల మేర ఎగబాకినప్పటికీ, చివరికి 879.09 పాయింట్ల (1.23 శాతం) లాభంతో 72,472.33 వద్దకు చేరింది. నిఫ్టీ 288.65 పాయింట్ల (1.30 శాతం) వృద్ధితో 22,520.45 వద్ద ముగిసింది. ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలు వ రూ.4.34 లక్షల కోట్లు పెరిగి రూ.465.31 లక్షల కోట్లకు (4.82 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. మార్కెట్ అంచనాలకు మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన టీసీఎస్ సహా ఇతర ఐటీ కంపెనీల షేర్లలో భారీ కొనుగోళ్లు ఇందు కు దోహదపడ్డాయి.
ఐటీ కంపెనీల విలువలో రూ.65,649 కోట్ల వృద్ధి
సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మినహా అన్నీ రాణించాయి. ఐటీసీ షేరు ఏకంగా 4.78 శాతం ఎగబాకి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. టీసీఎస్ షేరు 4.23 శాతం పుంజుకోగా.. ఇన్ఫోసిస్ 3.01 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.84 శాతం, టెక్ మహీంద్రా 1.43 శాతం లాభపడ్డాయి. ఐటీ రంగ షేర్ల ర్యాలీతో మార్కెట్ సంపద రూ.65,649 కోట్ల మేర పెరిగింది. అందులో టీసీఎస్ విలువ వృద్ధే రూ.31,749 కోట్లు.
8 వారాల వరుస నష్టాలకు బ్రేక్
ఈ వారం మొత్తానికి సెన్సెక్స్ 562.63 పాయింట్లు, నిఫ్టీ 98.5 పాయింట్ల లాభాన్ని నమోదు చేశాయి. దాంతో మార్కెట్లో 8 వారా ల వరుస నష్టాల ట్రెండ్‌కు అడ్డుకట్ట పడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు పెరిగి రూ.96.71 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర 102 డాలర్లకు జారుకుంది.
వెండి రూ.4,500 జంప్
దేశీయంగా విలువైన లోహాల ధరలు పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛ త బంగారం 10 గ్రాముల ధర రూ.1,900 పెరుగుదలతో రూ.1.54 లక్షల కోట్లకు చేరుకుంది. కిలో వెండి ఏకంగా రూ.4,500 ఎగబాకి రూ.2,28,500గా నమోదైంది.