తప్పుడు హామీలతో బీమా ఉత్పత్తులు అంటకడితే రూ.10 కోట్ల జరిమానా
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:01 AM
ఖాతాదారులకు అవసరం ఉన్నా, లేకపోయినా తప్పుడు హామీలతో బీమా పథకాలు అంటగట్టే పద్ధతికి చెక్ పెట్టేందుకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ)...
ఐఆర్‌డీఏఐ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఖాతాదారులకు అవసరం ఉన్నా, లేకపోయినా తప్పుడు హామీలతో బీమా పథకాలు అంటగట్టే పద్ధతికి చెక్ పెట్టేందుకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) సిద్ధమైంది. ఇందుకోసం ఐఆర్‌డీఏఐ ఇన్సూరెన్స్ ఇంటర్మీడియరీస్ (సవరణ) నిబంధనలు, 2026 పేరుతో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఏ కార్పొరేట్ ఏజెంట్ అయినా తప్పుడు హామీలతో బీమా పాలసీలు అంటగట్టినట్టు తేలితే రూ.10 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.కోటి మాత్రమే. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల ఏజెంట్లు తప్పుడు హామీలతో ప్రజలకు బీమా పాలసీలు అంటగడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఐఆర్‌డీఏఐ ఈ చర్యలకు సిద్ధమైంది. ఈ మార్గదర్శకాలతో బీమా కంపెనీల్లో మరింత జవాబుదారీతనం, పాలసీల విక్రయంలో పారదర్శకత ఏర్పడి, పాలసీదారులకు ఇచ్చే సేవల నాణ్యతా ప్రమాణాలూ మెరుగుపడతాయని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!