ఐఓసీ లాభాల్లో రికార్డు
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:40 AM
ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ).. సెప్టెంబరు త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్ ప్రతిపాదికన రూ.21,630 కోట్ల రికార్డు స్థాయి నికర లాభాన్ని నమోదు చేసింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ).. సెప్టెంబరు త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్ ప్రతిపాదికన రూ.21,630 కోట్ల రికార్డు స్థాయి నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.7,610.45 కోట్లతో పోలిస్తే లాభం మూడు రెట్లు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో ఆర్జించిన లాభం ఇప్పటి వరకు సంస్థ నమోదు చేసిన అత్యధిక వార్షిక నికర లాభం రూ.39,619 కోట్లలో సగానికి పైగా మించి ఉండడం విశేషం. కార్యకలాపాల ఆదాయం రూ.2.03 లక్షల కోట్ల నుంచి రూ.2.63 లక్షల కోట్లకు పెరిగింది.