Share News

విస్తరణ బాటలో ఇంటీరియో బై గోద్రెజ్‌

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:49 AM

ఫర్నీచర్‌, డిజైన్‌ బ్రాండ్‌ ఇంటీరియో బై గ్రోద్రెజ్‌.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విస్తరణకు రెడీ అవుతోంది. రానున్న కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా...

విస్తరణ బాటలో ఇంటీరియో బై గోద్రెజ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఫర్నీచర్‌, డిజైన్‌ బ్రాండ్‌ ఇంటీరియో బై గ్రోద్రెజ్‌.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విస్తరణకు రెడీ అవుతోంది. రానున్న కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 12 స్టోర్స్‌తో పాటు 100కు పైగా రిటైలర్స్‌ కేంద్రాలను ప్రారంభించాలని చూస్తున్నట్లు సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దేవ్‌ నారాయణ్‌ సర్కార్‌ వెల్లడించారు. గురువారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో 18 స్టోర్లను నిర్వహిస్తోందన్నారు. అలాగే 55 మంది డీలర్లు, 150కి పైగా రిటైలర్స్‌ ఉన్నారని తెలిపారు. ఇంటీరియో బై గోద్రెజ్‌.. హైదరాబాద్‌లో మొత్తం 14 స్టోర్స్‌ను నిర్వహిస్తోందన్నారు. విస్తరణలో భాగంగా వచ్చే వారం విశాఖపట్నంలో కొత్త స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే ఏలూరులో కూడా స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కాగా ఫర్నీచర్‌ ఉత్పత్తులకు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) ప్రమాణాలను అమలు చేస్తుండటంతో రానున్న రోజు ల్లో సంఘటిత రంగంలోని కంపెనీలకు కలిసిరానుందన్నారు. ఇంటీరియో ఇప్పటికే యూరోపియన్‌ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత ఫర్నీచర్‌ మార్కెట్‌ రూ.2.72 లక్షల కోట్లు (2,927 కోట్ల డాలర్లు)గా ఉందని, ఇందులో సంఘటిత రంగం వాటా 20 శాతంగా ఉందని సర్కార్‌ తెలిపారు. ఇంటీరియో ప్రస్తుతం దేశవ్యాప్తం గా 1,015 స్టోర్లను నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తోందా.. హోర్ముజ్‌లో నౌకలు నగదు చెల్లిస్తున్నాయా..

మీ దృష్టికి అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నమైన సంఖ్యను 10 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 27 , 2026 | 01:49 AM