Share News

ఇన్ఫీ గూటికి 2 యూఎస్‌ కంపెనీలు

ABN , Publish Date - Mar 27 , 2026 | 02:00 AM

అమెరికాకు చెందిన రెండు టెక్నాలజీ కంపెనీలను కొనుగోలు చేసేందుకు విడివిడిగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌...

ఇన్ఫీ గూటికి 2 యూఎస్‌ కంపెనీలు

డీల్‌ విలువ 5,260 కోట్లు

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన రెండు టెక్నాలజీ కంపెనీలను కొనుగోలు చేసేందుకు విడివిడిగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ గురువారం ప్రకటించింది. హెల్త్‌కేర్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ కంపెనీ ‘ఆప్టిమమ్‌ హెల్త్‌కేర్‌ ఐటీ’తో పాటు ఇన్సూరెన్స్‌ కన్సల్టింగ్‌ టెక్నాలజీ కంపెనీ స్ట్రాటస్‌ గ్లోబల్‌ ఎల్‌ఎల్‌సీని మొత్తం 56 కోట్ల డాలర్లకు (రూ.5,260 కోట్లు) దక్కించుకోబోతున్నట్లు తెలిపింది. అందులో ఆప్టిమమ్‌ హెల్త్‌కేర్‌ ఐటీ కోసం 46.5 కోట్ల డాలర్లు (రూ.4,368 కోట్లు), స్ట్రాటస్‌ కోసం 9.5 కోట్ల డాలర్లు (రూ.892 కోట్లు) చెల్లించనుంది. ఇన్ఫోసిస్‌ తన అనుబంధ విభాగమైన ఇన్ఫోసిస్‌ నోవా హోల్డింగ్స్‌ ఎల్‌ఎల్‌సీ ద్వారా ఈ రెండు కంపెనీలను టేకోవర్‌ చేయనుంది. ఈ కొనుగోలు లావాదేవీలు వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికంలో పూర్తి కావచ్చని అంచనా.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తోందా.. హోర్ముజ్‌లో నౌకలు నగదు చెల్లిస్తున్నాయా..

మీ దృష్టికి అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నమైన సంఖ్యను 10 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 27 , 2026 | 02:00 AM