Share News

పొదుపుపై ఫోకస్‌.. ఖర్చుల్లో కోత!

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:09 AM

అంతర్జాతీయంగా ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరిగిన నేపథ్యంలో భారతీయుల్లో పొదుపు, ఖర్చుల నియంత్రణపై దృష్టి పెరిగిందని కాంటార్‌ తాజా సర్వే నివేదిక...

పొదుపుపై ఫోకస్‌.. ఖర్చుల్లో కోత!

ఆర్థిక అనిశ్చితుల వేళ భారతీయుల ధోరణిపై కాంటార్‌ సర్వే

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరిగిన నేపథ్యంలో భారతీయుల్లో పొదుపు, ఖర్చుల నియంత్రణపై దృష్టి పెరిగిందని కాంటార్‌ తాజా సర్వే నివేదిక వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ, వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిపై వినియోగదారుల్లో విశ్వాసం సన్నగిల్లిందని, ఈ నేపథ్యంలో వారు వీలైనంతగా పొదుపు చేయాలనుకుంటున్నారని రిపోర్టు పేర్కొంది. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని, దీర్ఘకాలంలో విలువ పెంచే కొనుగోళ్లకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని కాంటార్‌ నివేదిక తెలిపింది.

అదే సమయంలో పర్యటనలతో పాటు అర్ధవంతమైన అనుభూతిని, ఆరోగ్యాన్ని పంచే ఖర్చులకు ప్రాముఖ్యతనిస్తున్నారని అంటోంది. మెట్రో, నాన్‌-మెట్రో నగరాల్లో నివసిస్తున్న 21-55 ఏళ్ల లోపున్న 1,684 మంది నుంచి మే నెలలో సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే నివేదికను రూపొందించినట్లు కాంటార్‌ తెలిపింది.

63 శాతం

  • తనతో పాటు కుటుంబ భవిష్యత్‌ అవసరాల కోసం మరింత పొదుపు చేయాలని భావిస్తున్నవారు.

  • రెస్టారెంట్లలో భోజనం చేయడం

  • వినోదం, షాపింగ్‌, సబ్‌స్ర్కిప్షన్లకు కోత పెట్టాలని చూస్తున్నవారు.

65 శాతం

పెరుగుతున్న ధరలే తమ జాగ్రత్తకు కారణమని అభిప్రాయపడినవారు.

48 శాతం

ఈ ఏడాదిలో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తున్నవారు. ఈ జనవరిలో నిర్వహించిన సర్వేలో ఈ వాటా 60 శాతంగా నమోదైంది.

61 శాతం

తమ పొదుపు సొమ్ము, పెట్టుబడుల విలువ 2025 నాటి స్థాయిలోనే కొనసాగవచ్చని లేదా మరింత తగ్గవచ్చని ఆందోళన వ్యక్తం చేసిన వారు. అంటే, వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిపై ధీమా క్రమంగా సడలుతున్నది. ఈ ఏడాదిలో తమ పెట్టుబడుల విలువ వృద్ధిపై కేవలం 39 శాతమే నమ్మకంగా ఉన్నారు.

ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయ్‌..

ఏ విషయంలో ఎంత మంది

ఆరోగ్య సంరక్షణ ఖర్చులు 85 శాతం

పెరుగుతున్న జీవన ఖర్చులు 80 శాతం

అద్దె, ఈఎంఐ చెల్లింపులు 71 శాతం

Updated Date - Jun 05 , 2026 | 04:16 AM