మదుపరులు జర భద్రం!
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:04 AM
గత ఏడాది అక్టోబరులో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన ఈ షేరు ఆ తర్వాత 27 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. ఈ ఏడాది మార్చి రెండో వారం నుంచి టర్న్ అరౌండ్ అయ్యింది.
ఈ వారం భారత స్టాక్ మార్కెట్లు భారీ కుదుపులకు లోనయ్యే అవకాశం ఉంది. శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఇరాన్, అమెరికా మళ్లీ పరస్పర దాడులకు దిగటంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించటం మంచిది.
స్టాక్ రికమండేషన్స్
యూనో మిండా: గత ఏడాది అక్టోబరులో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన ఈ షేరు ఆ తర్వాత 27 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. ఈ ఏడాది మార్చి రెండో వారం నుంచి టర్న్ అరౌండ్ అయ్యింది. రిలేటివ్ స్ట్రెంత్ కూడా క్రమంగా పెరుగుతోంది. గత గురువారం భారీ వాల్యూమ్‌తో రూ.1,136 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,100 శ్రేణిలో ప్రవేశించి రూ.1,250 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,070 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
అపోలో టైర్స్: కొన్ని నెలలుగా పతనమవుతూ వస్తున్న ఈ షేరు మళ్లీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. గణనీయమైన వాల్యూమ్‌తో జోరు ప్రదర్శిస్తోంది. మే నెల చివరి వారం నుంచి ఇప్పటి వరకు ఏకంగా 20 శాతం రాబడిని అందించింది. గత గురువారం రూ.430 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.420 వద్ద ఎంటరై రూ.500 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.400 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
సీజీ పవర్: ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ షేరు బుల్‌రన్‌ను కొనసాగిస్తోంది. నష్టాల మార్కెట్లోనూ స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోంది. 20 రోజుల మూవింగ్ యావరేజీని కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది. మొత్తంగా ఈ ఏడాది 70 శాతం మేర రాబడిని అందించింది. గత గురువారం రూ.942 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.940 శ్రేణిలో ప్రవేశించి రూ.1,050 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.910 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
వెల్‌స్పన్ కార్ప్: సుదీర్ఘ బేస్ బ్రేకౌట్ తర్వాత ఈ షేరు పరుగులు తీస్తోంది. బుల్‌రన్‌ను కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 100 శాతం మేర రాబడిని అందించింది. రిలేటివ్ స్ట్రెంత్‌కు తిరుగులేదు. గత గురువారం రూ.1,455 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.1,440 వద్ద పొజిషన్ తీసుకుని రూ.1,550 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,420 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
మణప్పురం ఫైనాన్స్: గత ఏడాది నుంచి ఈ షేరు అప్‌ట్రెండ్‌లోనే కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి ఏప్రిల్ వరకు 22 శాతం వరకు దిద్దుబాటుకు లోనైంది. ఆ తర్వాత మళ్లీ పుంజుకుని జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతోంది. బేస్ పూర్తవ్వటం, మంచి వాల్యూమ్ నమోదవుతుండటం తో వీటిపై ఆసక్తి పెరిగింది. గత గురువారం రూ.318 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.315 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.390 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.300 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.