సెన్సెక్స్ 183 పాయింట్లు పతనం
ABN , Publish Date - Aug 27 , 2026 | 06:14 AM
ముడి చమురు ధరలు మరింత తగ్గిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఆరంభంలో లాభాల్లో ట్రేడైనప్పటికీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ రంగ షేర్లలో అమ్మకాల కారణంగా చివరికి నష్టాల్లో ముగిశాయి.
ముంబై: ముడి చమురు ధరలు మరింత తగ్గిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఆరంభంలో లాభాల్లో ట్రేడైనప్పటికీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ రంగ షేర్లలో అమ్మకాల కారణంగా చివరికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 183.15 పాయింట్లు కోల్పోయి 77,472.94 వద్దకు జారుకుంది. నిఫ్టీ 126.80 పాయింట్లు పతనమై 24,207.75 వద్ద స్థిరపడింది.
అవాడా ఎలెక్ట్రో రూ.7,600 కోట్ల ఐపీఓ: అవాడా గ్రూప్‌నకు చెందిన సోలార్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ అవాడా ఎలెక్ట్రో లిమిటెడ్ ఐపీఓకు రానుంది. ఐపీఓలో భాగంగా రూ.1,600 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రమోటర్.. అవాడా వెంచర్స్‌కు చెందిన రూ.6,000 కోట్ల విలువైన షేర్లను ఓఎఫ్‌ఎస్ ద్వారా విక్రయించను న్నారు. ఐపీఓ ద్వారా మొత్తం రూ.7,600 కోట్లు సమీకరించనుంది.