అయ్యో.. రూపాయే!
ABN , Publish Date - Mar 03 , 2026 | 02:51 AM
ఫారెక్స్ ట్రేడింగ్‌లో మన కరెన్సీ భారీగా నష్టపోయింది. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 42 పైసలు క్షీణించి రూ.91.49 వద్ద ముగిసింది....
ఒక్కరోజులో 41 పైసల పతనం
రూ.91.49 స్థాయికి మారకం రేటు
ముంబై: ఫారెక్స్ ట్రేడింగ్‌లో మన కరెన్సీ భారీగా నష్టపోయింది. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 42 పైసలు క్షీణించి రూ.91.49 వద్ద ముగిసింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో పాటు యూఎస్ డాలర్‌కు డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణం. మన ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ రూపాయిపై ఒత్తిడి ని మరింత పెంచాయని ఫారెక్స్ వర్గాలు తెలిపాయి. మన కరెన్సీపై ఒత్తిడి కొనసాగనుందని, మున్ముందు మారకం విలువ రూ.91.10-91.80శ్రేణిలో కదలాడవచ్చని వారన్నారు.