Share News

రికార్డు గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

ABN , Publish Date - Jun 16 , 2026 | 01:45 AM

ఈ ఏడాది మే నెలకు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు గరిష్ఠ స్థాయి 9.68 శాతానికి ఎగబాకింది....

రికార్డు గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

  • మే నెలలో 9.68 శాతానికి చేరిక

న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలకు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు గరిష్ఠ స్థాయి 9.68 శాతానికి ఎగబాకింది. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో ఇంధన, విద్యుత్‌ ధరలు భారీగా పెరగడం ఇందుకు ప్రధాన కారణమైంది. ఈ ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం 8.26 శాతంగా నమోదైంది. గడిచిన 9 ఏళ్లలో తొలిసారిగా టోకు ధరల ద్రవ్యోల్బణం లెక్కింపునకు ఆధార సంవత్సరా (బేస్‌ ఇయర్‌)న్ని 2011-12 నుంచి 2022-23కు మార్చారు.

Updated Date - Jun 16 , 2026 | 01:45 AM