Share News

డబ్ల్యూపీఐ స్థానంలో పీపీఐ

ABN , Publish Date - Jun 03 , 2026 | 01:10 AM

దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులపై మరింత వాస్తవిక అంచనాను అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ)ని...

డబ్ల్యూపీఐ స్థానంలో పీపీఐ

ఈ నెల 15 నుంచి డబ్ల్యూపీఐ, పీపీఐ కొత్త సీరి్‌సలు

ద్రవ్యోల్బణంపై మరింత వాస్తవిక అంచనాకు అవకాశం

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులపై మరింత వాస్తవిక అంచనాను అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ)ని దశల వారీగా నిలిపివేసి దాని స్థానంలో మరింత సమగ్రమైన ప్రొడ్యూసర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (పీపీఐ)ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఔట్‌పుట్‌ (ఉత్పత్తి), ఇన్‌పుట్‌ (ఉత్పాదక వస్తువులు), సేవల ధరలను పీపీఐ కవర్‌ చేస్తుంది. పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఈ నెల 15న 2011-12 ఆధార సంవత్సరంతో ఉన్న ప్రస్తుత సీరిస్‌ స్థానంలో 2022-23 కొత్త ఆధార సంవత్సరంతో సవరించిన డబ్ల్యూపీఐ సీరి్‌సను విడుదల చేస్తుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ప్రధాన ఆర్థిక సలహాదారు ప్రవీణ్‌ మహతో చెప్పారు.

పీపీఐలో మూడు సూచీలు

అలాగే ఈ నెల 15వ తేదీ నుంచి పీపీఐ కొత్త సీరి్‌సను కూడా డీపీఐఐటీ విడుదల చేయనుందని మహతో తెలిపారు. పీపీఐలో మూడు సూచీలు ఉంటాయి. అవి ఉత్పత్తి పీపీఐ, ప్రయోగాత్మక ఇన్‌పుట్‌ పీపీఐ, సర్వీసెస్‌ పీపీఐ. తొలుత సర్వీసుల పీపీఐలో ఏడు సర్వీసులు.. బ్యాంకింగ్‌, సెక్యూరిటీస్‌ లావాదేవీ, బీమా, పెన్షన్‌ ఫండ్స్‌ నిర్వహణ, రైల్వేస్‌, విమానయానం (ప్రయాణికులు), టెలికాం ఉంటాయి. తర్వాతి కాలంలో మరిన్ని సర్వీసులను కూడా దీనికి జత చేయనున్నారు.

ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 03 , 2026 | 01:10 AM