2047 నాటికి ఏటా 60 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యం
ABN , Publish Date - Oct 12 , 2026 | 05:10 AM
కొత్త ఉక్కు (స్టీల్) పాలసీని ఆవిష్కరించేందుకు కేంద్ర ప్రభు త్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగం గా ‘నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047’ పేరుతో..
కొత్త ఉక్కు పాలసీ ముసాయిదా విడుదల
న్యూఢిల్లీ: కొత్త ఉక్కు (స్టీల్) పాలసీని ఆవిష్కరించేందుకు కేంద్ర ప్రభు త్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగం గా ‘నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047’ పేరుతో ఒక ముసాయిదా పత్రం విడుదల చేసింది. 2047 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న ‘వికసిత్ భారత్’కు అనుగుణంగా ఈ ముసాయిదా పత్రాన్ని రూపొందించారు.
ప్రధానాంశాలు
2047 నాటికి ఏటా 60.4 కోట్ల టన్నుల ముడి ఉక్కు ఉత్పత్తి
2047 నాటికి దేశంలో ఏటా 50.5 కోట్ల టన్నుల ఉక్కుకు గిరాకీ
2026 నాటికి 116 కిలోలుగా ఉన్న తలసరి స్టీల్ వినియోగాన్ని 302 కిలోలకు పెంచటం
2047 నాటికి ఏటా 4.5 కోట్ల టన్నుల ఉక్కు ఎగుమతి
ప్రస్తుతం ఏటా 29.9 కోట్ల టన్నులుగా ఉన్న ఇనుప ఖనిజ ఉత్పత్తిని 2047 నాటికి 77.2 కోట్ల టన్నులకు పెంచటం
దిగుమతులకు చెక్ పెట్టేందుకు దేశంలోనే హై ఎండ్ స్టీల్ ఉత్పత్తి పెంచటమే లక్ష్యం
ప్రధాన ముడి పదార్ధాలైన ఇనుప ఖనిజం, కోకింగ్ కోల్ సరఫరాలకు సురక్షిత చర్యలు