Share News

దక్షిణ కొరియా కూడా దాటేసింది..

ABN , Publish Date - Jun 03 , 2026 | 01:06 AM

ప్రపంచంలో అత్యంత విలువైన స్టాక్‌ మార్కెట్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌ మరో మెట్టు జారుకుంది. గత వారంలో తైవాన్‌ భారత్‌ను వెనక్కి నెట్టి 5వ స్థానానికి చేరుకోగా.. 6వ స్థానాన్ని తాజాగా...

దక్షిణ కొరియా కూడా దాటేసింది..

ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల ర్యాంకింగ్‌లో

ఏడో స్థానానికి జారుకున్న భారత్‌

ప్రపంచంలో అత్యంత విలువైన స్టాక్‌ మార్కెట్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌ మరో మెట్టు జారుకుంది. గత వారంలో తైవాన్‌ భారత్‌ను వెనక్కి నెట్టి 5వ స్థానానికి చేరుకోగా.. 6వ స్థానాన్ని తాజాగా దక్షిణ కొరియా కైవసం చేసుకుంది. దాంతో ఇండియా 7వ స్థానానికి పడిపోయింది. కేవలం వారం రోజుల్లో రెండు స్థానాలను చేజార్చుకుంది. ఇందుకు ప్రధాన కారణం కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో అత్యాఽధునిక సెమీకండక్టర్లు (చిప్‌), ఇతర మెమొరీ పరికరాలకు డిమాండ్‌ భారీగా పెరగడమే. సామ్‌సంగ్‌, ఎస్‌కే హైనిక్స్‌ కంపెనీల షేర్ల ర్యాలీ దక్షిణ కొరియా స్టాక్‌ మార్కెట్‌ను కదం తొక్కించగా.. తైవాన్‌ సెమీకండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ (టీఎ్‌సఎంసీ) షేర్లు ఈ ఏడాదిలో 50 శాతానికి పైగా వృద్ధి చెందడం ఆ దేశ స్టాక్‌ మార్కెట్‌ విలువను భారీగా పెంచేసింది.

బ్లూంబర్గ్‌ తాజా డేటా ప్రకారం.. దక్షిణ కొరియా స్టాక్‌ మార్కెట్‌ విలువ ఈ ఏడాదిలో 86 శాతం మేర పెరిగి మొత్తం 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. భారత స్టాక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 4.86 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. దక్షిణ కొరియా ప్రామాణిక ఈక్విటీ సూచీ కోస్పీలో అధిక వెయిటేజీ కలిగిన సామ్‌సంగ్‌, ఎస్‌కే హైనిక్స్‌ ఈ మధ్యనే లక్ష కోట్ల డాలర్ల (ట్రిలియన్‌ డాలర్లు) క్లబ్‌లో చేరాయి. దక్షిణ కొరియా ఈ ఏడాదిలో భారత్‌నే కాదు కెనడా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్‌ స్టాక్‌ మార్కెట్ల విలువను కూడా అధిగమించేసింది.

ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 03 , 2026 | 01:06 AM