Share News

రూపాయల్లో వాణిజ్యానికి మేం రెడీ

ABN , Publish Date - Oct 17 , 2026 | 05:22 AM

అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

రూపాయల్లో  వాణిజ్యానికి  మేం రెడీ
nirmalaseetharaman

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. డాలర్ల వంటి ప్రధాన విదేశీ మారక ద్రవ్య కొరత ఎదుర్కొంటున్న దేశాలతో జరిగే ద్వైపాక్షిక వాణిజ్యంలో రూపాయితో పాటు ఆయా దేశాల కరెన్సీల్లో చెల్లింపులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్య కొరత ఎదుర్కొంటున్న దేశాలు, ఎలాంటి ఆటంకాలు లేకుండా భారత్‌ నుంచి సరుకులు దిగుమతి చేసుకోగలుగుతాయన్నారు. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఐఎంఎఫ్-ప్రపంచ బ్యాంక్‌ వార్షిక సమావేశాలకు హాజరైన సీతారామన్‌.. అట్లాంటిక్‌ కౌన్సిల్‌ సభ్యులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలకు స్థానిక కరెన్సీల్లో చెల్లింపులే సత్వర పరిష్కార మార్గమని ఆమె స్పష్టం చేశారు.

చైనా విధానాలే అడ్డంకి: ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనా అనుసరిస్తున్న నాన్‌-టారి్‌ఫ అడ్డంకులపైనా ఆర్థిక మంత్రి సీతారామన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనా ఎలాంటి సంకోచాలు లేకుండా ఈ విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. దీంతో కూరగాయలు, గొడ్డు మాంసం, జెనరిక్‌ ఔషధాల వంటి భారత ఎగుమతులు పెద్దగా చైనా మార్కెట్లోకి ప్రవేశించలేక పోతున్నాయన్నారు. ఈ అనుచిత వాణిజ్య విధానాల వల్లే ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్‌ భారీ లోటు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.

Updated Date - Oct 17 , 2026 | 05:22 AM