భారత్‌లో చమురుకు భారీ డిమాండ్
ABN , Publish Date - Jun 08 , 2026 | 01:20 AM
వచ్చే పదేళ్లలో భారత్‌లో ముడి చమురు, విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుందని రష్యా భావిస్తోంది. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా పెరిగే చమురు డిమాండ్ వృద్ధి రేటులో సగం...
2035 నాటికి 44% అప్: రాస్‌నెఫ్ట్
సెయింట్‌పీటర్స్‌బర్గ్ (రష్యా): వచ్చే పదేళ్లలో భారత్‌లో ముడి చమురు, విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుందని రష్యా భావిస్తోంది. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా పెరిగే చమురు డిమాండ్ వృద్ధి రేటులో సగం, విద్యుత్ డిమాండ్ వృద్ధి రేటులో 15 శాతం భారత్ నుంచే ఉంటుందని రష్యాకు చెందిన ప్రముఖ చమురు సంస్థ రాస్‌నెఫ్ట్ సీఈఓ ఇగర్ సెచిన్ చెప్పారు. రష్యాలో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సు (ఐఈఎ్‌ఫ)లో ఆయన ఈ విషయం చెప్పారు. భారత్ వినియోగించే రోజువారీ చమురు గిరాకీనే 2035 నాటికి 44 శాతం పెరిగి 80 లక్షల బ్యారళ్లకు చేరుతుందని తెలిపారు. ఇదే సమయంలో రోజువారీ విద్యుత్ గిరాకీ 80 శాతం పెరిగి ప్రస్తుతం యూరప్ దేశాల వినియోగ స్థాయి అయిన 3,000 టెరావాట్ అవర్స్‌కు చేరుతుందన్నారు. కాగా ఎవరు ఎన్ని ఆంక్షలు విధించినా ప్రపంచ చమురు మార్కెట్లో రష్యా స్థాయిని తగ్గించలేరని అమెరికా, యూరప్ దేశాలకు స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు వేళాయే..