Share News

ఆఫీస్‌ లీజింగ్‌లో 15 శాతం వృద్ధి

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:46 AM

అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత రియల్టీ రంగం స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తోంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని...

ఆఫీస్‌ లీజింగ్‌లో 15 శాతం వృద్ధి

హైదరాబాద్‌లో రెండింతల పెరుగుదల

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత రియల్టీ రంగం స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తోంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాల లీజింగ్‌ 15 శాతం వృద్ధి చెంది 1.83 కోట్ల చదరపు అడుగులకు చేరినట్లు కోలియర్స్‌ ఇండియా వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 1.59 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. వివిధ రంగాల్లో డిమాండ్‌ పెరగడం, గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) విస్తరణ ఈ వృద్ధికి ప్రధాన కారణమని సంస్థ తెలిపింది. కాగా ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో బెంగళూరు 18 శాతం వృద్ధి (53 లక్షల చదరపు అడుగులు)తో అగ్రస్థానంలో ఉండగా హైదరాబాద్‌లో మాత్రం లీజింగ్‌ 17 లక్షల చదరపు అడుగుల నుంచి రికార్డు స్థాయిలో 34 లక్షల చదరపు అడుగులకు పెరిగింది.

Updated Date - Mar 27 , 2026 | 01:47 AM