మారిషస్‌కు ఐఓసీ ఇంధనం
ABN , Publish Date - Aug 23 , 2026 | 02:55 AM
భారత్, మారిష్‌సలు ఇంధన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. ఐదేళ్ల కాలానికి ఇరు దేశాలు...
న్యూఢిల్లీ: భారత్, మారిష్‌సలు ఇంధన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. ఐదేళ్ల కాలానికి ఇరు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మారిష్‌సకు అవసరమైన పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన (ఏటీఎఫ్) మొత్తం దిగుమతులను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సరఫరా చేయనుంది. ఈ నెల 20-21 తేదీల్లో పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి.. మారిషస్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది.