Share News

ఐటీ రంగంలో సైలెంట్ లేఆఫ్స్!

ABN , Publish Date - Jul 09 , 2026 | 09:53 PM

భారత ఐటీ రంగంలో సైలెంట్ లేఆఫ్స్ చోటుచేసుకుంటున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పనితీరుపై సమీక్షలు, నైపుణ్యాల ముదింపు పేరిట ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఐటీ రంగంలో సైలెంట్ లేఆఫ్స్!
IT Sector Layoffs

ఇంటర్నెట్ డెస్క్: భారత ఐటీ రంగంలో సైలెంట్ లేఆఫ్స్ చోటుచేసుకుంటున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పనితీరుపై సమీక్షలు, నైపుణ్యాల ముదింపు పేరిట ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. టీమ్ లీజ్ సంస్థ అంచనాల ప్రకారం, ఈ ఏడాదిలో తొలగింపులు 25 వేల నుంచి 35 వేల వరకూ ఉండే అవకాశం ఉంది. మే నెల నాటికే 15 వేల మంది ఉద్వాసనకు గురయ్యారు. ఇక సీఐఈఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ అంచనాల ప్రకారం, ఐటీ రంగంలో ఈ ఏడాది ఇప్పటివరకూ 12 వేల మంది ఉద్వాసనకు గురయ్యారు. 2025, 2026 సంవత్సరాల్లో మొత్తం తొలగింపుల సంఖ్య 43 వేలు దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


గతంలో ఐటీ సేవలకు డిమాండ్ తగ్గడంతో తొలగింపులు జరిగాయని టీమ్ లీజ్ సంస్థ పేర్కొంది. అయితే, ప్రస్తుత లేఆఫ్స్ వెనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నట్టు చెబుతోంది. ఏఐతో పెరిగిన ఉత్పాదకత, సంస్థల అవసరాలు, ఉద్యోగుల నైపుణ్యాల మధ్య పెరిగిన అంతరం, బహుళ అంచెల మేనేజ్‌మెంట్ వ్యవస్థలను సరళీకరించాలన్న ప్రయత్నాలు లేఆఫ్స్‌కు కారణమని టీమ్ లీజ్ సంస్థ పేర్కొంది. అవసరాలకు అనుగుణంగా మానవవనరుల్లో మార్పులు జరుగుతున్నాయని సంస్థ పేర్కొంది. సులభంగా ఆటోమేట్ చేయగలిగే బాధ్యతలు, జాబ్స్‌కు ముప్పు ఉన్నప్పటికీ భవిష్యత్ అవసరాల కోసం ప్రత్యేక నిపుణుల నియామకాలు కూడా ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 09 , 2026 | 09:58 PM