ఈ ఏడాది భారత వృద్ధి 7శాతం: ఎస్‌అండ్‌పీ అంచనా
ABN , Publish Date - Nov 24 , 2026 | 04:12 AM
ఎల్‌నినో దెబ్బతో ఆసియా పసిఫిక్ ఆర్థిక వ్యవస్థల్లో ముఖ్యంగా భారత్‌లో ఆహార ధరలు భగ్గుమనే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ సోమవారం వెల్లడించింది.
న్యూఢిల్లీ: ఎల్‌నినో దెబ్బతో ఆసియా పసిఫిక్ ఆర్థిక వ్యవస్థల్లో ముఖ్యంగా భారత్‌లో ఆహార ధరలు భగ్గుమనే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ సోమవారం వెల్లడించింది. వచ్చే నెలలో ఆర్‌బీఐ రెపో రేటును మరో 0.25 శాతం మేర పెంచవచ్చని అంచనా వేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలోనూ వడ్డీ రేటు పెరగవచ్చని తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)తో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీలో 7 శాతం వృద్ధి నమోదు కావొచ్చని పేర్కొంది. వచ్చే ఏడాదిలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలవనుందని కూడా తెలిపింది. అధిక ఇంధన ధరలు ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థలకు ప్రధాన ప్రతికూల అంశంగా, కృత్రిమ మేధ రంగం సానుకూలంగా ఉంటుందని పేర్కొంది. వచ్చే ఏడాదిలో ఈ రెండింటి ప్రభావాలు కొంత తగ్గుతాయని తెలిపింది.