Share News

2 రోజులు.. రూ.24,000 కోట్ల విక్రయాలు

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:27 AM

పండగ సీజన్‌ నేపథ్యంలో ఈ-కామర్స్‌ సంస్థల విక్రయాలు ఊపందుకున్నాయి. పండగ సేల్‌ ప్రారంభమైన రెండు రోజుల్లోనే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మీషో, అజియో తదితర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా..

2 రోజులు.. రూ.24,000 కోట్ల విక్రయాలు

న్యూఢిల్లీ: పండగ సీజన్‌ నేపథ్యంలో ఈ-కామర్స్‌ సంస్థల విక్రయాలు ఊపందుకున్నాయి. పండగ సేల్‌ ప్రారంభమైన రెండు రోజుల్లోనే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మీషో, అజియో తదితర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా సుమారు రూ. 24,000 కోట్ల విలువైన ఉత్పత్తుల అమ్మకాలు జరిగినట్లు కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్‌ అంచనా వేసింది. ఈ రెండు రోజుల్లో సాధారణ రోజువారీ వ్యాపారం కంటే ఆర్డర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగిందని తెలిపింది. సుమారు 6 నుంచి 6.5 కోట్ల వినియోగదారులు దాదాపు 8-9 కోట్ల ఆర్డర్లు చేసినట్లు వెల్లడించింది. మొత్తం అమ్మకాల్లో స్మార్ట్‌ఫోన్లు వాటా 30-40 శాతం (రూ.9,100-9,600 కోట్లు), కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి గృహోపకరణాల వాటా 25-27 శాతం (రూ.6,000-6,500 కోట్లు), ఫ్యాషన్‌ ఉత్పత్తుల వాటా 15-18 శాతం (రూ.3,630-4,350 కోట్లు) ఉన్నట్లు రెడ్‌సీర్‌ అంచనా వేసింది.

Updated Date - Oct 12 , 2026 | 05:28 AM