Share News

2036 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 20 లక్షల కోట్ల డాలర్లకు

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:11 AM

ప్రస్తుతం 3.7 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.351.5 లక్షల కోట్లు)గా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2036నాటికి 20 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరే...

2036 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 20 లక్షల కోట్ల డాలర్లకు

న్యూఢిల్లీ: ప్రస్తుతం 3.7 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.351.5 లక్షల కోట్లు)గా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2036నాటికి 20 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని దేశీయ బ్రోకరేజీ సంస్థ ఈక్విరస్‌ ఒక నివేదికలో తెలిపింది. అయితే ఇందుకోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోక తప్పదని స్పష్టం చేసింది. ముఖ్యంగా డాలర్ల పరంగా చూస్తే వచ్చే పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ఏటా సగటున 18 శాతం చొప్పున అభివృద్ధి చెందాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం సేవల రంగానికి పెద్దపీట వేయాల్సి ఉంటుందని ఈక్విరస్‌ సూచించింది.

Updated Date - Aug 17 , 2026 | 05:11 AM