Share News

డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్‌

ABN , Publish Date - Nov 29 , 2026 | 03:46 AM

డేటా సెంటర్లకు హైదరాబాద్‌ హబ్‌గా మారుతోంది. దేశంలో అధికంగా డేటా సెంటర్లు ఏర్పాటవుతున్న 7 ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌..

డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్‌

  • నిర్మాణంలో ఉన్న డేటా సెంటర్లలో రెండో స్థానం: నైట్‌ ఫ్రాంక్‌

న్యూఢిల్లీ: డేటా సెంటర్లకు హైదరాబాద్‌ హబ్‌గా మారుతోంది. దేశంలో అధికంగా డేటా సెంటర్లు ఏర్పాటవుతున్న 7 ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ ‘నైట్‌ ఫ్రాంక్‌’ తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడు నగరాల్లో ప్రస్తుతం 80 డేటా సెంటర్ల నిర్మాణం జరుగుతున్నదని నివేదిక తెలిపింది. అందులో 42.5 శాతం వాటాకు సమానమైన 34 డేటా సెంటర్ల నిర్మాణంతో ముంబై అగ్రస్థానంలో ఉంది. కాగా, హైదరాబాద్‌లో 15 సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. అందులో 100 మెగావాట్లకు పైగా సామర్థ్యంతో కూడిన కేంద్రాల సంఖ్య 4 నుంచి 8కి పెరగగా.. 50-100 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన కేంద్రాలు 6. అంటే, మొత్తం 15లో 14 కేంద్రాలు 50 మెగావాట్ల కంటే అధిక సామర్థ్యం కలిగినవే. ముంబైలో ఏర్పాటవుతున్న సెంటర్లలో 50 మెగావాట్ల కంటే తక్కువ సామర్థ్యం కలిగినవే అధికం. దాంతో భారీ స్థాయి డేటా సెంటర్లకు హైదరాబాద్‌ కీలక వేదికగా మారిందని నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది.

Updated Date - Nov 29 , 2026 | 03:48 AM