డేటా సెంటర్ల సామర్థ్యంలో హైదరాబాద్‌కు 27వ స్థానం
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:59 AM
ప్రపంచంలోని ఆయా నగరాల్లో ప్రస్తుతం నిర్వహణలో ఉన్న డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యం పరంగా ముంబై 15వ స్థానంలో ఉండగా.. హైదరాబాద్‌కు 27వ స్థానం దక్కింది...
15వ స్థానంలో ముంబై: నైట్ ఫ్రాంక్
న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఆయా నగరాల్లో ప్రస్తుతం నిర్వహణలో ఉన్న డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యం పరంగా ముంబై 15వ స్థానంలో ఉండగా.. హైదరాబాద్‌కు 27వ స్థానం దక్కింది. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల కంపెనీ నైట్ ఫ్రాంక్ గురువారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా పసిఫిక్, పశ్చిమాసియా, ఆఫ్రికాలోని 36 అగ్రగామి డేటా సెంటర్ మార్కెట్లను అధ్యయనం చేసి నైట్ ఫ్రాంక్ ఈ నివేదికను రూపొందించింది. అభివృద్ధి దశలో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యం పరంగా ముంబై 11వ స్థానాన్ని దక్కించుకుంది. ముంబైలో ప్రస్తుతం 774 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్లు నిర్వహణలో ఉండగా.. దాదాపు 5 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన కేంద్రాలు నిర్మాణ లేదా అభివృద్ధి దశలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యం పరంగా హైదరాబాద్‌కు 19వ స్థానంలో ఉంది. మొత్తం 151 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్లు ఇప్పటికే సేవలందిస్తుండగా.. 2.2 గిగావాట్లకు పైగా సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్లు నిర్మాణంలో ఉన్నాయి.
టాప్ 5 నగరాలు ఉత్తర అమెరికాలోనే: నిర్వహణలో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యం పరంగా తొలి ఐదు స్థానాలు దక్కించుకున్న యాష్‌బర్న్, కొలంబస్, డల్లాస్, ఫీనిక్స్, అట్లాంటా నగరాలు ఉత్తర అమెరికాకు చెందినవే కావడం గమనార్హం. కాగా, టోక్యో, లండన్, డబ్లిన్, చికాగో, సింగపూర్ వరుసగా 6 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..
చెత్తకుప్పలో కాలిన మృతదేహం.. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు