Share News

హైదరాబాద్‌లో రూ.50 కోట్లతో ఫర్నీచర్‌ ప్లాంట్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:24 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ప్రీమియం ఫర్నీచర్‌ బ్రాండ్‌ ఫాబియెన్స్‌.. రూ.50 కోట్ల పెట్టుబడితో కొత్త ప్లాంట్‌ను ఏర్పా టు చేస్తున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్‌లో   రూ.50 కోట్లతో ఫర్నీచర్‌ ప్లాంట్‌
furniture

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ప్రీమియం ఫర్నీచర్‌ బ్రాండ్‌ ఫాబియెన్స్‌.. రూ.50 కోట్ల పెట్టుబడితో కొత్త ప్లాంట్‌ను ఏర్పా టు చేస్తున్నట్లు ప్రకటించింది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌ సమీపంలో 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను నెలకొల్పుతున్నట్లు కంపెనీ ఎండీ రాజ్‌ వేణుగోపాల్‌ తక్కళ్లపల్లి వెల్లడించారు. వచ్చే ఏడాది కల్లా అందుబాటులోకి రానున్న ఈ ప్లాంట్‌ ద్వారా సుమారు 100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. కటింగ్‌-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌, అడ్వాన్స్‌డ్‌ ఇటాలియన్‌, జర్మనీ మెషినరీతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాంట్‌లో సోఫాలు, చెయిర్స్‌తో మాడ్యులర్‌ ఫర్నీచర్‌ను కంపెనీ తయారు చేయనుంది. కాగా కంపెనీ ఇప్పటికే హైదరాబాద్‌లో రూ.80 కోట్ల పెట్టుబడితో ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు 3,500కు పైగా రెసిడెన్షియల్‌, కమర్షియల్‌, హాస్పిటాలిటీ రంగాలకు చెందిన ప్రాజెక్టులకు ప్రీమియం ఫర్నీచర్‌ సొల్యూషన్స్‌ను అందించింది.

Updated Date - Oct 10 , 2026 | 05:36 AM