Share News

హెచ్‌యూఎల్‌ డిటర్జెంట్‌ ఉత్పత్తులు మరింత ప్రియం

ABN , Publish Date - Nov 10 , 2026 | 05:10 AM

హిందుస్థాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) తన హోం కేర్‌ పోర్ట్‌ఫోలియోలోని పలు ఉత్పత్తుల గరిష్ఠ చిల్లర ధరల (ఎంఆర్‌పీ)ను 11 శాతం వరకు...

హెచ్‌యూఎల్‌ డిటర్జెంట్‌ ఉత్పత్తులు మరింత ప్రియం

11% వరకు ధరల పెంపు

న్యూఢిల్లీ: హిందుస్థాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) తన హోం కేర్‌ పోర్ట్‌ఫోలియోలోని పలు ఉత్పత్తుల గరిష్ఠ చిల్లర ధరల (ఎంఆర్‌పీ)ను 11 శాతం వరకు పెంచింది. వీటిలో సర్ఫ్‌ ఎక్సెల్‌, రిన్‌, వీల్‌ వంటి ప్రాచుర్యం కలిగిన డిటర్జెంట్‌ బ్రాండ్లు కూడా ఉన్నాయి. ముడి సరుకుల ధరల పెరుగుదలతో ఏర్పడిన ఒత్తిడిని తట్టుకోవడానికి, మార్జిన్లను కాపాడుకోవడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్యాక్‌ల పరిమాణాలను బట్టి ధరలను కంపెనీ సవరించింది. ఈ పెంపు రూ.1 నుంచి రూ.10 వరకు ఉంది.

Updated Date - Nov 10 , 2026 | 05:10 AM