నెఫ్రోప్లస్ ఆదాయం రూ.303 కోట్లు
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:21 AM
నెఫ్రోప్లస్ బ్రాండ్‌తో డయాలసిస్ సేవలందిస్తున్న నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన తైమాసికంలో రూ.303.40 కోట్ల రెవెన్యూపై రూ.39.3 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): నెఫ్రోప్లస్ బ్రాండ్‌తో డయాలసిస్ సేవలందిస్తున్న నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన తైమాసికంలో రూ.303.40 కోట్ల రెవెన్యూపై రూ.39.3 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 28.7శాతం పెరగగా ఆదాయం 23.5ు వృద్ధి చెందింది. మధుమేహం, అధిక రక్తపోటు కారణంగా ప్రపంచవ్యాప్తంగా డయాలసిస్ మార్కెట్ పెరుగుతోందని, ఇదే సమయంలో కంపెనీ కూడా నిలకడైన వృద్ధిని నమోదు చేస్తూ వస్తోందని నెఫ్రోకేర్ తెలిపింది. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ రెండు క్లినిక్స్‌ను కొనుగోలు చేయ టం ద్వారా కజకిస్థాన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం కంపెనీ ఆరు దేశాల్లో 570కి పైగా క్లినిక్స్‌ను నిర్వహిస్తోంది.