2028 నాటికి 80 లక్షల యూనిట్లకు ఉత్పత్తి సామర్థ్యం
ABN , Publish Date - Jul 10 , 2026 | 02:23 AM
భారత మార్కెట్‌ను గ్లోబల్ తయారీ, ఎగుమతి క్రేందంగా మార్చే వ్యూహాంలో భాగంగా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) మెగా విస్తరణకు శ్రీకారం చుట్టింది
హోండా మోటార్‌సైకిల్
న్యూఢిల్లీ: భారత మార్కెట్‌ను గ్లోబల్ తయారీ, ఎగుమతి క్రేందంగా మార్చే వ్యూహాంలో భాగంగా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) మెగా విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2028 నాటికి వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 80 లక్షల యూనిట్లకు పెంచడంతో పాటు 3,800కు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ సుత్సుము ఒటానీ తెలిపారు. దేశీయ డిమాండ్‌తో పాటు అంతర్జాతీయ అవసరాలను తీర్చేందుకు తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నామని చెప్పారు. కాగా ఈ విస్తరణ ప్రణాళికలో భాగంగా హెచ్‌ఎంఎ్‌సఐ.. రాజస్థాన్‌లోని తపుకర ప్లాంటులో రూ.1,500 కోట్ల పెట్టుబడితో మూడో ఉత్పత్తి యూనిట్‌ను, గుజరాత్‌లో విఠలాపూర్ ప్లాంట్‌లో రూ.920 కోట్లతో నాలుగో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. కొత్త ప్లాంట్లతో 2028 నాటికి కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 80 లక్షల యూనిట్లకు చేరనుంది.
ఈ వార్తలనూ చదవండి:
రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..