మా ఫ్రెష్ పనీర్ పేరుకు తగ్గదే..
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:17 AM
తమ పనీర్ ప్యాకెట్లపై ‘ఫ్రెష్ పనీర్’ అని ఉండడంపై భారత ఆహార భద్రత, ప్రామాణికాల సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) జారీ చేసిన...
ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ నోటీసుపై స్పందించిన హెరిటేజ్ ఫుడ్స్
హైదరాబాద్: తమ పనీర్ ప్యాకెట్లపై ‘ఫ్రెష్ పనీర్’ అని ఉండడంపై భారత ఆహార భద్రత, ప్రామాణికాల సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) జారీ చేసిన షోకాజ్ నోటీసుకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సవివరంగా సమాధానం ఇచ్చింది. ప్యాకెట్‌పైన లేబుల్ మా పనీర్‌కు కచ్చితమైన వివరణ అని, వినియోగదారులను తప్పుదారి పట్టించేది కాదని తెలిపింది. ఫ్రెష్ పనీర్ అంటే తాజాగా పాశ్చరైజ్డ్ పాలతో చేసి పరిమిత కాల వినియోగం కోసం రిఫ్రిజిరేషన్‌లో ఉంచదగిన పాల ఉత్పత్తి అని అర్థమని సంస్థ పేర్కొంది.