Share News

జీఆర్‌టీ జువెలర్స్‌.. స్వర్ణ ఆషాఢ ఆఫర్లు

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:52 AM

జీఆర్‌టీ జువెలర్స్‌.. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని స్వర్ణ ఆషాఢ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగం గా బంగారు ఆభరణాల కొనుగోలుపై...

జీఆర్‌టీ జువెలర్స్‌.. స్వర్ణ ఆషాఢ ఆఫర్లు

హైదరాబాద్‌: జీఆర్‌టీ జువెలర్స్‌.. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని స్వర్ణ ఆషాఢ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగం గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు రూ.200 వరకు తగ్గింపుతో పాటు పాత బంగారం మార్పిడిపై గ్రాముకు అదనంగా రూ.150 వరకు ప్రయోజనం పొందవచ్చని వెల్లడించింది. అలాగే డైమండ్‌, అన్‌కట్‌ డైమండ్‌ ఆభరణాల విలువపై 12.5 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా వెండి వస్తువుల తయారీ చార్జీల (వీఏ)పై 25 శాతం వరకు, వెండి ఆభరణాల ఎంఆర్‌పీపై 10 శాతం వరకు రాయితీని అందిస్తున్నట్లు జీఆర్‌టీ జువెలర్స్‌ పేర్కొంది. దక్షిణాదిలోని 68 షోరూమ్‌లతో పాటు సింగపూర్‌లోని షోరూమ్‌లో ఈ ఆషాఢ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు

Updated Date - Jul 08 , 2026 | 05:52 AM