Share News

జీఆర్‌టీ జువెలర్స్‌ చేతికి టీబీజెడ్‌

ABN , Publish Date - Sep 02 , 2026 | 04:41 AM

జీఆర్‌టీ జువెలర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌.. లిస్టెడ్‌ సంస్థ త్రిభువన్‌దా్‌స భీమ్‌జీ జవేరీ లిమిటెడ్‌ (టీబీజెడ్‌)లో 74.12 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు...

జీఆర్‌టీ జువెలర్స్‌ చేతికి టీబీజెడ్‌

రూ.1,034 కోట్లకు 74% వాటా కొనుగోలు

చెన్నై (ఆంధ్రజ్యోతి): జీఆర్‌టీ జువెలర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌.. లిస్టెడ్‌ సంస్థ త్రిభువన్‌దా్‌స భీమ్‌జీ జవేరీ లిమిటెడ్‌ (టీబీజెడ్‌)లో 74.12 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు టీబీజెడ్‌ ప్రమోటర్లతో షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (ఎస్‌పీఏ)ను కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా టీబీజెడ్‌ ప్రమోటర్ల వాటాను రూ.1,033.71 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు జీఆర్‌టీ జువెలర్స్‌ వెల్లడించింది. రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ఈ ఒప్పందం ఉంటుందని పేర్కొంది. అలాగే సెబీ నిబంధనలకు అనుగుణంగా మరో 26 శాతం వాటాకు ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించనున్నట్లు జీఆర్‌టీ జువెలర్స్‌ తెలిపింది. 162 ఏళ్ల చరిత్ర కలిగిన టీబీజెడ్‌ బ్రాండ్‌ కొనుగోలుతో జీఆర్‌టీ జువెలర్స్‌ మరింత బలోపేతమవుతుందని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్లు అనంత్‌ అనంత పద్మనాభన్‌, జీఆర్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా జీఆర్‌టీ జువెలర్స్‌ను విస్తరించేందుకు ఈ కొనుగోలు దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం టీబీజెడ్‌ దేశంలో 37 షోరూమ్‌లను నిర్వహిస్తుండగా జీఆర్‌టీ జువెలర్స్‌.. భారత్‌లో 68 షోరూమ్స్‌, సింగపూర్‌లో ఒక షోరూమ్‌ను నిర్వహిస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Updated Date - Sep 02 , 2026 | 04:41 AM