Share News

గోల్డ్‌ స్పాట్‌ మళ్లీ వస్తోంది

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:07 AM

ఒకప్పుడు తియ్యటి, పులుపు (నారింజ) రుచులతో భారతీయుల మనసులను గెలుచుకున్న శీతల పానీయం ‘గోల్డ్‌ స్పాట్‌’.. 26 ఏళ్ల తర్వాత మళ్లీ పలకరించనుంది. రిలయన్స్‌ కాంపా నుంచి..

గోల్డ్‌ స్పాట్‌ మళ్లీ వస్తోంది

  • 26 ఏళ్ల తర్వాత తిరిగి ప్రవేశపెట్టనున్న కోకా కోలా

న్యూఢిల్లీ: ఒకప్పుడు తియ్యటి, పులుపు (నారింజ) రుచులతో భారతీయుల మనసులను గెలుచుకున్న శీతల పానీయం ‘గోల్డ్‌ స్పాట్‌’.. 26 ఏళ్ల తర్వాత మళ్లీ పలకరించనుంది. రిలయన్స్‌ కాంపా నుంచి ఎదురవుతున్న పోటీని.. గోల్డ్‌ స్పాట్‌తో ఎదుర్కొనేందుకు కోకా కోలా సిద్ధమైంది!. వచ్చే వారమే ఈ బ్రాండ్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. తక్కువ చక్కెర, చక్కెర లేని రెండు రకాల్లో దీన్ని తీసుకురానుంది. అలాగే, ‘కోక్‌ జీరో జీరో’ పేరుతో కొత్త డ్రింక్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. ఇందులో చక్కెర, కెఫిన్‌ రెండూ జీరో స్థాయిలో ఉంటాయి. ఆరెంజ్‌ ఫ్లేవర్‌ డ్రింక్‌ అయిన గోల్డ్‌ స్పాట్‌ను భారతీయులకు మొదటిసారి 1952లో పార్లే సంస్థ పరిచయం చేసింది. భారత సాఫ్ట్‌ డ్రింక్స్‌ మార్కెట్లో పార్లే సంస్థ 70 శాతం వాటాను సొంతం చేసుకోవడంలో.. ఈ ఉత్పత్తి కీలకంగా పనిచేసింది. దీంతో గోల్డ్‌ స్పాట్‌ సహా పార్లే సాఫ్ట్‌డ్రింక్స్‌ (థమ్సప్‌, లిమ్కా, మాజా) వ్యాపారాన్ని 1993లో కోకా కోలా కొనుగోలు చేసింది. ఆ తర్వాత తన అంతర్జాతీయ బ్రాండ్‌ అయిన ఫాంటాకు ప్రాచుర్యం కల్పించుకునేందుకు వ్యూహాత్మకంగా 2000లో గోల్డ్‌ స్పాట్‌ ఉత్పత్తిని నిలిపివేసింది.

Updated Date - Nov 24 , 2026 | 04:08 AM